బాలకృష్ణ, బాపు కాంబినేషన్లో రూపొందిన శ్రీరామరాజ్యం సినిమాపై ఓ ఫైనాన్షియర్ కోర్టుకెక్కారు. ఈ చిత్ర నిర్మాత తన నుంచి కొంత సొమ్ము తీసుకున్నారనీ, అయితే తన డబ్బు తిరిగి చెల్లించలేదనీ ఆ ఫైనాన్షియర్ హైదరాబాదు సివిల్ కోర్టులో కేసు వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన న్యాయమూర్తి రాధారాణి, కొన్ని షరతులతో సినిమా విడుదలకు అనుమతిచ్చారు. ఆ మొత్తాన్ని నిర్మాత సదరు ఫైనాన్షియర్ కు చెల్లించినా, లేక కోర్టుకు జమచేసినా చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ చిత్రం పై మరో వివాదం కూడా తలెత్తింది .ఈ సినిమాలో చాకలి తిప్పడు పాత్రను బ్రహ్మానందం చేశాడు. ఆ పాత్ర రజకుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటుందేమోనని ఆ వర్గం వారు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు . ఈ చిత్రం నుంచి చాకలి తిప్పడు పాత్రను తొలగించాలని రజక సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారని సమాచారం. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.

Click Like Button for updates inFacebook orJoin Us FREEto Get Blog Updates To Your Mail Inbox