విద్యాబాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్’ 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే... ఈ సినిమా బడ్జెట్ కేవలం 18 కోట్లు. ఈ సినిమాతో అప్పటిదాకా ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ సూపర్‌స్టార్ అయ్యిపోయింది. ప్రస్తుతం ఆమె ‘డర్డీపిక్చర్’ తెచ్చిన ఆనందాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో విద్యపై ఓ గాసిప్ మొదలైంది.
యూటీవీ అధినేతల్లో ఒకరైన సిద్దార్థ్‌రాయ్‌తో విద్య ప్రేమలో పడ్డారని, 14 కోట్లు విలువ చేసే ఓ అందమైన బిల్డింగ్ ని విద్యకు నూతన సంవత్సరకానుకగా సిద్దార్థ్ అందించారని, ముంబయ్‌లోని ‘జుహూ తారా’ అనే ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ భవంతిలోకి త్వరలోనే విద్య గృహప్రవేశం చేయనున్నారని ఈ గాసిప్ లో వినపడుతున్న మాట. అయితే మీడియా వారు ఆమె వద్ద ఈ గాసిప్ పై ప్రస్తావిస్తే...ఇలాంటి గాసిప్స్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు.
ఇవాళే కాదు, ఏడాది తర్వాత అయినా సరే... ఆ ఏరియాలో నాకు భవంతి ఉందని మీరు రుజువుచేస్తే... దాన్ని మీకు రాసిస్తా. అనవసరంగా ఇలాంటి వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యింది. ఇక డర్టీ పిక్చర్ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది.
Click Like Button for updates inFacebook orJoin Us FREEto Get Blog Updates To Your Mail Inbox